April 15, 2026

బీసీ ధర్మ ధీక్ష సక్సెస్.. ప్రభుత్వాల్లో చలనం వస్తుందా..

బీసీలకు జనాభా ప్రకారం సమాన హక్కులు ఇవ్వడంతోపాటు బీసీల అభ్యున్నతికి ఐదు ప్రధానమైన డిమాండ్లు చేస్తూ భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ -Bode Ramachandra Yadav చేస్తున్న ఆమరణ నిరాహార ధీక్ష కు స్పందన బాగానే వచ్చింది.

పార్టీపరంగా చూస్తే భారత చైతన్య యువజన పార్టీ -BCY ఇంకా పురిటి దశలోనే ఉంది. కాని ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మాత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. #BCDharmadeeksha పేరుతో ట్రెండింగ్ లోకి వచ్చారు.

అది ఆయన గొప్పతనమా అనే కంటే కూడా ఆయన చేపట్టిన నిరాహారధీక్ష గొప్పతనం అది.  బీసీ వర్గాలకు హక్కులు దక్కేలా చేపట్టిన ఆ ధీక్ష దేశ వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. అందుకే బీసీలకు  ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని OBC రిజర్వేషన్ల పితామహుడిగా పిలిచే బీపీ మండల్ మనుముడు డా.సూరజ్ మండల్  (Suraj mandal) వ్యాఖ్యానించారు.

బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ధీక్షకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఆ విషయాలను విస్మరించడం బాధాకరమని, ఇప్పటికైనా బీసీలకు సమాన హక్కులు  కల్పించాలని కోరారు.

జ్యోతిబా పూలే ముని మనుమరాలు డా. రమాకాంత్ పూలే  (Ramakanth Pule) అయితే బీసీల అభ్యున్నతికి రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. రామచంద్ర యాదవ్ కు తమ సంఘీభావం ప్రకటించడంతోపాటు పొగిడారు. అదే సందర్భంలో ప్రభుత్వాల కుటిల నీతిని ప్రశ్నించారు.

రమాకాంత్ పూలే మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాకారమైనప్పుడే జ్యోతిబా పూలే ఆకాంక్ష నెరవేరినట్లవుతుందని వ్యాఖ్యానించారు. బీసీలకు జనాభా ప్రకారం సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని సూచించారు.

అయితే రామచంద్రయాదవ్ ధీక్షను ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తుంది? అనే ప్రశ్నసశేషమే అయినప్పటికీ రామచంద్ర యాదవ్ అడుగుతున్న ఐదు డిమాండ్లలో న్యాయం ఉంది. అందుకే ధీక్షకు మద్దతు పెరిగింది. మరి ప్రభుత్వం ఎంతమేరకు స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *