April 15, 2026

TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్

TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ (Nara Lokesh)ని నియమిస్తూ TDP నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ఏపీ (AP) టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలారును నియమించారు.
పార్టీ పొలిట్ బ్యూట్, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ ప్రకటించింది.
సీనియర్టీ, పనితీరు, విధేయత, ప్రజాసమస్యల పరిష్కారం చొరవ, యువతకు ప్రాధాన్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని  ఈ ఎంపిక జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
29మందితో పొలిట్ బ్యూరో, 31 మందిలో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని నియమించారు. ఇందులో జాతీయ ప్రధాన కార్యర్ధులు ముగ్గురు ఉండగా, జాతీయ ఉపాధ్యక్షులు 18మంది, జాతీయ అధికార ప్రతినిధులు 10మంది ఉన్నారు.
#TDP #naralokesh #andhrapradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *