బిహార్ (Bihar) రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సీఎంగా సామ్రాట్ చౌదరి (samrat chaudhary) బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర చరిత్రలో తొలి బీజేపీ (BJP) ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ (Nitish kumar) ఇటీవలే రాజ్యసభ (Rajyasabha)కు ఎంపికయ్యారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన బలమైన నేత, ఇటీవలి వరకు బీజేపీ -BJP ఫ్లోర్ లీడర్ గా ఉన్న సామ్రాట్ చౌదరిని సీఎంగా బీజేపీ అదిష్టానం ఎంపిక చేసింది. దీంతో బుధవారం బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్ (Lok bhavan)లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
