April 13, 2026

హక్కుల్లో సింహ భాగం కోసం BC బిడ్డ సింహనాదం

సమాజంలో మెజార్టీ వర్గాలుగా ఉన్న బీసీలకు ఆ మేరకు రాజ్యాధికారంలో వాటా దక్కిందా అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి. బీసీలను అన్ని పార్టీలు తమ ఓటు బ్యాంకు (Vote Bank)గా వాడుకున్నాయే తప్ప సమ న్యాయం చేయలేకపోయాయి. మరో బాధాకరమైన అంశం ఏంటంటే.. మైనార్టీలు, ఎస్టీ, ఎస్సీలకు ఇచ్చినంత ప్రాధాన్యం బీసీ వర్గాలకు ఇవ్వడంతో విఫలం అయ్యాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధుల కేటాయింపులో మళ్లీ వివక్షే. హక్కులాగా దక్కాల్సిన రాజ్యాధికారం..ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన పరిస్థితిలోకి బీసీ వర్గాలు నెట్టబడ్డాయి. ఇందులో తప్పెవరిది అంటే ఏం చెప్పలేం. కాని ఐక్యత లేకపోవడం మాత్రం కచ్చితంగా బలహీనతే.

ఇది అంతులేని కథ. అనామకంగా మిగిలిచిపోయిన వివక్ష చరిత. గతంలో కొంతమంది బీసీ (BC)లను ఉద్దరిస్తామని ముందుకొచ్చారు. అందలం ఎక్కారు. వెనుక బడిన కులాలు -Backward class  వారిని తమ భుజాలపై మోశాయి. అయితే ఆ నాయకులు బీసీల అభ్యున్నతికి వారు ఎంత కృషి చేశారనేది చెప్పలేం కాని..వారు మాత్రం పదవులు దక్కించుకున్నారు. బీసీలు మాత్రం అంతే ఉన్నారు.

చివరికి జనాభా ప్రకారం రిజర్వేషన్లు (Reservations) ఇవ్వాలనే డిమాండ్ ఎక్కడ వస్తుందోనన్న భయంతో బీసీ కులగణన (BC Caste Census) కు కూడా చాలా రాష్ట్రాలు ముందుకు రాలేదు. జనాభా లెక్కలు తేల్చలేదు. ఇలా బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు సమన్యాయం, బీసీ ల అభ్యున్నతి వంటి అంశాలు కాగితాల్లో చూసి బీసీ బిడ్డలు మురిసిపోయేందుకే పరిమితం అయ్యాయి.

అలాంటి పరిస్థితికి చెక్ పెట్టేలా సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు  బోడె రామచంద్ర యాదవ్ (Bode Ramachandra Yadav) భారత చైతన్య యువజన పార్టీ వేదికగా బీసీల హక్కుల కోసం గళం విప్పారు.

ప్రధానంగా ఐదు డిమాండ్లతో ఏప్రిల్ 11న (శనివారం – Saturday) మంగళగిరి (Mangalagiri)లో ఆమరణ నిరాహార ధీక్ష  (Dheeksha) చేపడుతున్నారు. ఆయన చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవే. ఆచరణ సాధ్యం కానివి కాదు. సమానత్వం కోసం అవసరమైన అడుగులు కూడా. కావాల్సిందల్లా ప్రభుత్వం నుంచి ఆచరణాత్మక విధానం అమలు చేయడమే. బీసీలంతా ఐక్యం కావడమే.

ఆయన చేస్తున్న డిమాండ్లు ఇవే..

1.⁠ ⁠బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.

2.⁠ ⁠ రాజధాని అమరావతి -Amaravathi ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి.

3.⁠ ⁠రాష్ట్రంలో సమగ్ర కులగణన (Caste csnsus) చేపట్టాలి.

4.⁠ ⁠విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు (Bc Reservation) కల్పించాలి.

5.⁠ ⁠బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి.

బీసీలను ఏకం చేసేలా…

ఈ డిమాండ్లు అమలు చేయడానికి పెద్దపెద్ద పరిశోధనలు అవసరం లేదు. రాజ్యాంగం కల్పిన హక్కులు, న్యాయపరమైన అంశాలు, సర్దుబాట్లు, చొరవ ఉంటే సరిపోతుంది. కాని ఇన్నాళ్లు ప్రభుత్వాలు చేయలేకపోయాయి. అందుకే బోడే రామచంద్రయాదవ్ (Bode Ramachandra Yadav) చేస్తున్న పోరాటం (Dharma dheeksha) అనిర్వచనీయమని చెప్పవచ్చు. ఆయన చేస్తున్న పోరాటం చూశాక బీసీల్లో చలనం వచ్చింది. అన్ని పార్టీలూ బోడే రామచంద్రయాదవ్ వైపు చూడడం ప్రారంభించాయి. పార్టీల్లో చర్చ జరుగుతోంది కూడా. ఏప్రిల్ 11న ఆయన చేపట్టనున్న ఈ ధీక్ష రాజకీయల్లో పెను సంచలనంగా మారనుంది కూడా.

మరి బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం విజయవంతం కావాలంటే సహకరించాల్సి ఎవరో కాదు.. బీసీ బిడ్డలే. అప్పుడే కదా భావితరాలకు సమాన హక్కులు దక్కేవి. అందుకే బీసీలను ఒకేతాటిపైకి తెచ్చేలా రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *