మరో రెండునెలల్లో తమిళనాడు(Tamilanadu)లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లతో రాజకీయ కురుక్షేత్రం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి బీజేపీ కూడా అక్కడ పాగా వేసేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. డీఎంకే వర్సెస్ ఏఐడీఎంకే అన్నట్లు పొత్తులు కుదిరినా.. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎన్నికల సమరం నడుస్తోంది. 234 అసెంబ్లీ స్థానాలు త్వరలోనే జరగనున్నందుకు అందరి చూపు తమిళనాడుపైనే ఉంది. అక్కడ జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఆసక్తికరంగానే మారింది.
తమిళనాట ప్రభావం చూపించేందుకు తనకు అవసరమైన అన్ని అవకాశాలను వాడుకుంటోంది బీజేపీ. #AMMK పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ను, మాజీ సీఎం, #AIADMK పళనిస్వామిని #NDA కూటమిలో చేర్చుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్ పెట్టిన తమిళ వెట్రి కలగం (#TVK)తో పొత్తు కుదుర్చునేందుకు చూస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు విజయ్.

కాని తాజాగా మహాబలిపురంలో జరిగిన సభలో దాదాపుగా క్లారిటీ ఇచ్చారు. తమ ఎన్నికల గుర్తైన విజిల్ ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ‘త్వరలో జరిగేవి ఎన్నికలు మాత్రమే కాదని..ప్రజాస్వామ్య యుద్ధమని, ఎవరికీ తలవంచేది లేదని చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.
దీంతో బీజేపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. గతంలో తమతో విజయ్ జట్టు కడతాడని భావిస్తూ వచ్చిన బీజేపీ ఇన్ డైరక్ట్ గా విజయ్ కు కొన్నాళ్లుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. గత ఏడాది TVK ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటనలోనూ #BJP #Vijayకి మద్దతు ప్రకటించింది. ఇటీవల జననాయగన్ సినిమా విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. DMKతోపాటు వైరి పక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నా #TVKని మాత్రం విమర్శించడం లేదు. తమతో ఎన్నికల సమయానికి జట్టుకడతాడని భావించడమే ఇందుకు కారణం. కాని తాజాగా #VIJAY చేసిన వ్యాఖ్యలు బీజేపీని నిరాశకు గురిచేశాయి.
అయితే చివరి నిమిషం వరకు పొత్తుల విషయంపై క్లారిటీ రాదు కాబట్టి.. అభ్యర్థులను ప్రకటించేలోపు విజయ్ NDA కూటమిలో చేరతాడనే ఉద్దేశంతో ఆశగా చూస్తోంది.
