బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు Bode Ramachandra Yadav చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (Dharmadeeksha) #Dharma_deeksha రెండో రోజుకు చేరుకుని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు సమాన న్యాయం, రాజకీయ ప్రాధాన్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ దీక్ష ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ధర్మ దీక్షకు తొలి రోజునే విశేష స్పందన లభించింది. బీసీ మండల్ మనుమడు Suraj Mandal, మహాత్మా జ్యోతిరావు పూలే ముని మనుమరాలు Neetatai Ramakant Phule తదితరులు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడంలో చాలా ఆలస్యం జరిగిందని, ఇప్పటికైనా అన్ని వర్గాల బీసీలు ఒకే వేదికపైకి వచ్చి తమ హక్కులు సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
తాజాగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. YCP మాజీ నేత, ఎంపీ Vijayasai Reddy కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించడం ఈ ఉద్యమానికి మద్దతు పలకడం మరింత ప్రాధాన్యం తెచ్చింది.

దీక్ష ప్రారంభమైన నాటి నుంచి పలు బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, రాజకీయ నాయకులు, యువజన సంఘాలు, మేధావులు, ప్రజాప్రతినిధులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, ప్రజలు, నాయకులు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి సానుకూల వస్తోంది.
ఈ సందర్భంగా బోడె రామచంద్ర యాదవ్ – Bode Ramachandra Yadav మాట్లాడుతూ, బీసీల న్యాయమైన హక్కుల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. తాము అసాధ్యమైన కోరికలు అడగడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. కుట్రలు చేసి ఈ దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
బోడె రామచంద్ర యాదవ్ చెబుతున్న ఐదు ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ప్రధాన డిమాండ్లు
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలి
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ కార్పొరేషన్లకు సరిపడా నిధులు విడుదల చేయాలి
- ఈ డిమాండ్లు అమలు చేస్తేనే బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ దీక్ష తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పార్టీ ప్రయోజనాల కోసం కూడా కాదని, పూర్తిగా బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ధర్మ యుద్ధమని బోడె రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం చేసిన ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు కూడా బీసీల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు.
ఆయా పార్టీలు చేస్తున్నట్లుగా తాము సంపదలో వాటా అడగడం లేదని, భూముల్లో వాటా అడగడం లేదని, కేవలం రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన హక్కులనే కోరుతున్నామని తెలిపారు. ఇది ఒక వ్యక్తి పోరాటం కాదని, కోట్లాది బీసీల ఆత్మగౌరవ ఉద్యమమని పేర్కొన్నారు.
ఈ ధర్మ దీక్షకు సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నేతలు Pasham Venkateshwarlu, T Kalyan Kumar, Sheikh Nazeer Basha, ఆర్జేడీ పార్టీ ప్రతినిధి Srinivas Yadav, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు Mekala Ramu, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ Thoomati Krishnamachari, మున్నూరు కాపు తెలంగాణా అధ్యక్షులు Parvatha Satish Kumar, తెలంగాణా రాష్ట్ర రజకసంఘం అధ్యక్షులు Chaparthi Kumar, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు Jaggarapu Srinivasa Rao, బీసీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు Dr N V Rao తో పాటు పద్మశాలి రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, ఆర్య కటక సంఘం, వడ్డెర రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు తదితరులు మద్దతు పలికారు.
మొత్తానికి… బీసీల హక్కుల కోసం మొదలైన ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.
