మెగాస్టార్ చిరు.. ఏది చేసినా సంచలనమే..ఏది చెప్పినా అభిమానులకు వేదమే. తాజాగా తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. తన సక్సెస్ వెనుక తన భార్య ఉందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భార్య సురేఖ (Surekha) పుట్టిన రోజున. ఈ సందర్భంగా భార్యకు విషెష్ చెబుతూ తన వివాహ బంధం గురించి పోస్ట్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న నా జీవితంలోకి వచ్చిన నువ్వు అండగా నిలిచావు. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు. నా జీవితంలో అతిపెద్ద బలం నువ్వు. ఈ రోజున నీ పుట్టిన రోజును జరుపుకోవాలని కోరుకోవడంతోపాటు త్వరలో రాబోయే మన వివాహ వార్షికోత్సవాన్ని ముందుగానే ఆహ్వానిస్తున్నాను. నా న హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మన కుటుంబానికి నువ్వే మూల స్తంభానివి.

నా కుటుంబ సభ్యులను నువ్వు సొంత కుటుంబీకులుగా చూశావు. ప్రతి క్షణంలో వారికి తోడుగా నిలిచారు. ఆప్యాయత పంచి నా తల్లిదండ్రులకు కూడా కుమార్తెవి అయ్యారు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా నన్ను అడిగితే, అది నా ప్రతిభ లేదా కృషి కాదు, “అది నువ్వే” అని చెబుతాను. ప్రతి బాధ్యతను ప్రశాంతంగా నిర్వర్తించావు కాబట్టే నేను నా వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను. ప్రతి సంక్షోభంలో, ప్రతి వేడుకలో, మమ్మల్ని కలిపి ఉంచేది నువ్వే. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా శక్తి. నీ వల్లే నేను ఉన్న స్థితిలో ఉన్నాను. నా ప్రేమతో, ఎల్లప్పుడూ మరియు ఎప్పటికీ అని పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
