April 4, 2026

తల్లిదండ్రులకు రేవంత్ మరిచిపోలేని బహుమతి

కొన్నాళ్ల క్రితం ప్రఖ్యాత రేమండ్ వ్యవస్థాపకుడు (Reymond) విజయ్ పత్ సింఘానియా ను కొన్న కొడుకే బయటకు గెంటాడు. ఓ మంత్రి స్వయంగా తండ్రిని పట్టించుకుండా వదిలేశాడు. ఓ కుమార్తె తన తల్లిదండ్రుల ఆస్తి తీసుకుని వాళ్ను బయటకు గెంటేసింది. కన్నవారి ఆదరణకు నోచుకోని అభాగ్యులు అనే శీర్షికతో వచ్చే వార్తలు ఒకప్పుడు సంచలనం..కాని నేడు బోరింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే కన్నతల్లిదండ్రుల గోస నేటి తరానికి పనికిరాని విషయంగా మారింది.

 

కాని నేటి యువత కూడా రేపటి తల్లిదండ్రులే. వాళ్ల వరకు వచ్చేసరికి పాత తరానికి ఉండే ఓపిక, ఓర్పు ఉండవు. కాని ఆ విషయాలు తెలసేందుకు ఇంకా చాలా సమయం ఉంది కనుక పట్టించుకోరు. నీకెవరూ వద్దు..నా కెవరూ వద్దు..మనమిద్దరే ముద్దు.. లంకంత కొంప కొందాం.. ఇద్దరమే తిరుగుదాం ..అనే వైఖరి కారణంగా చాలా కుటుంబాల్లో ఎంతో మంది తల్లిదండ్రులు ఆదరణకు నోచుకోలేదు. వారి ఆవేధనను పట్టించుకునేవారు లేరు. పిల్లలు తమను బయటకు గెంటినా, బయటి వారికి ఆ విషయం చెబితే కొడుక్కి లేదా కూతురుకి నామోషీ అని అనుకుని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆ బాధను పంటి బిగువున భరించే తల్లిదండ్రులకూ కొదవలేదు. కాని అలాంటివారికి నేటితరం వారసుల గూబ పగిలేలా..కాదు..కాదు.. నెత్తి పగిలి కళ్లు నేలమీదకు దించేలా కొత్త చట్టం (parents protection bill) తెచ్చింది రేవంత్  (Revanth reddy) సర్కార్.

అదే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 15 శాతం కోత విధించేందుకు వీలుగా తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్, 2026ను తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్లు తుది నిర్ణయకర్తలుగా ఈ చట్టాన్ని అమలు చేయనుంది.

అంటే ఇదేదో ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించే చట్టమే అనుకుంటే పొరపాటే. ప్రైవేటు ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ వర్తిస్తుంది. ఆడా-మగా తేడా లేకుండా వర్తిస్తుంది. అంటే తల్లిదండ్రులను ఆదరించకపోతే చట్టం అమలవుతుంది. ఆర్థికంగా మాత్రమే కాదు.. ఈ చట్టం అమలైతే తల్లిదండ్రులను గెంటేసిన పుత్ర తర్నాలు, పుత్రికలను సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందుకే ఈ చట్టం ఆంత ఆషామాషీ కాదు.

అందుకే సామాజిక విలువలు పెంపొందించడంతోపాటు నైతిక విలువలు పెంచేలా రేవంత్ సర్కార్ తెచ్చిన కొత్త చట్టం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అనాథలుగా మారకుండా, వారికి సామాజిక భద్రత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం కావడంతో ప్రతి తల్లిదండ్రికి ఈ చట్టం ఒక చుట్టమే కదా.

 

తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం-2026’

Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *