రైతులను వాణిజ్య పంటలవైపు మళ్లించేందుకు, పంటల వైవిద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వాణిజ్య పంటలు, పప్పు ధాన్యాలు పండించే రైతులకు ఎకరానికి రూ. 10వేల చొప్పున ప్రోత్సాహక నిధులు అందించనుంది.
ప్రస్తుతం పంజాబ్ (Punjab) లో ఈ విధానం అమల్లో ఉంది. వాణిజ్య పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి రూ.17,000 చొప్పున ప్రోత్సాహక నిధులను పంజాబ్ ప్రభుత్వం అందిస్తోంది. ఆ తరహాలోనే తెలంగాణలోనూ వాణిజ్య పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 10వేల చొప్పున అందించేందుకు ప్రణాళిక వేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy).

కారణాలు ఇవీ..
- వరి (paddy) సాగు చేస్తున్న రైతులనుంచి ధాన్యం సేకరణకు ఎకరాకు సరాసరి రూ. 20వేలను ప్రభుత్వం చెల్లిస్తోంది.
- మార్కెట్లోకి ధాన్యం ఒకేసారి రావడం, అవసరానికి మించి ఉత్పత్తి ఉండడంతో నిల్వ చేయడం కూడా సమస్యగా మారింది.
- అవసరానికి మించిన ఉత్పత్తి ఉండడంతో ధరకోసం డిమాండ్ చేసే అవకాశం కూడా తగ్గుతోంది.
- ఇతర ధాన్యాలు, పప్పు ధాన్యాలను ఇతర రాష్ట్రాలనుంచి తీసుకోవాల్సి వస్తోంది.
రైతులకు లాభాలు ఇవీ (ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం)
- వాణిజ్య పంటలను (Commercial crops), పప్పు ధాన్యాల సాగును, ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తే తెలంగాణ (Telangana) రైతులకు (Farmers) మేలు జరుగుతుంది.
- వరి ఉత్పత్తి కూడా కొంత తగ్గుతుంది. తద్వారా గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోంది.
- ప్రభుత్వంపైనా భారం తగ్గుతోంది.
త్వరలోనే ఈ అంశాలపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

