February 26, 2026

బీసీ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ..నిజమెంత ?

బీసీలకు 42 % రిజర్వేషన్లు (BC Reservations) ఇచ్చేందుకు తాము పోరాటం చేస్తున్నామని చెప్పింది రేవంత్ సర్కార్ (CM Revanth Reddy). దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన (caste census)  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. బీసీలకు 42 శాతం (42%) రిజర్వేషన్లు ఇచ్చేందుకు అసెంబ్లీ (Telangana Assembly)లో తీర్మానం చేసింది. ఆ బిల్లును ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే ఇంకా ఆ బిల్లు ఆమోదం పొందలేదు. కేంద్రం వద్దనే ఉంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది. న్యాయపోరాటంలో మాత్రం రేవంత్ సర్కార్ వెనుక బడింది. ఇదంతా ఒక ఎత్తైతే తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అదే మాటకు కట్టుబడి ఉంది. అమలు చేసింది కూడా.

పంచాయతీ ఎన్నికల్లో..

రాష్ట్రంలోని 12, 760 పంచాయతీల్లో 2,1 86 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 6 వేల మందికిపైగా బీసీ అభ్యర్థులను సర్పంచ్ లుగా నిలబెట్టింది. అంటే  రిజర్వ్ చేసిన సీట్లకు అదనంగా మరో 3, 500 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 5, 123 మంది బీసీ అభ్యర్థులు సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కాకుండా 2, 937 పంచాయతీల్లో బీసీ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందారు. నాన్ షెడ్యూల్ పంచాయతీల లెక్కల ప్రకారం చూస్తే 50 శాతానికి పైగా బీసీ అభ్యర్థులనే గెలిపించుకుంది రేవంత్ సర్కార్.

మున్సిపల్ ఎన్నికల్లో..

ఇక మున్సిపల్ ఎన్నికల (Municipal elections) విషయానికి వస్తే..ఈ విషయంలో అన్ని పార్టీలు బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించినా అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే అందులో 35 మున్సిపల్ ఛైర్మన్ల సీట్లు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. వాటికి అదనంగా మరో 27 మున్సిపాల్టీల్లో బీసీలే చైర్మన్లు అయ్యారు. సాధారణంగా జనరల్ స్థానాల్లో ఓసీ కులాలు ఎక్కువగా పోటీ చేస్తుంటాయి. కాని ఈ సారి కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులనే చైర్మన్లుగా ఎంపిక చేసింది. వీరిలో గౌడ, పద్మశాలీ, మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. 105 మున్సిపాల్టీల్లో చైర్మన్ల ఎంపిక పూర్ కాగా అందులో కాంగ్రెస్ పార్టీనుంచి ఎన్నికైనవారిలో బీసీల సంఖ్య 54.

ఇక ఏడు కార్పొరేషన్లలో నిజామాబాద్ (Nizamabad) మేయర్ స్థానం జనరల్ కోటాలో ఉన్నప్పటికీ బీసీ మహిళ (BC Woman) క్కించుకోవడం విశేషమే. మొత్తంగా చూస్తే మునిసిపల్‌ చైర్మన్‌ పదవుల్లో ఏకంగా 60.95 శాతం బీసీలకు దక్కాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారి వాటా దాదాపు 80 శాతం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *