మనం సినిమాల్లో హీరోల కొడుకులు మాత్రమే చాలావరకు హీరోలుగా వస్తుండడాన్ని చూసి ఉంటాం. కాని హీరోయిన్ల హీరోయిన్ల కూతుర్లు సినిమాల్లోకి వచ్చిన దాఖలాలు చాలా తక్కువే. అలాంటివారు మన తెలుగు చిత్రసీమ (Tollywood) లో ఎందరున్నారో చూద్దాం.
శ్రీదేవి – జాన్వికపూర్ :
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వికపూర్ (Janhvi Kapoor) ధడక్ అనే సినిమాతో బాలివుడ్లోకి అడుగుపెట్టింది. శ్రీదేవి జాన్వి సినిమా కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కానీ తన తొలిసినిమా చూడకుండానే కన్నుమూసింది. తెలుగులో దేవరలో జూనియన్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది జాన్వికపూర్ (Janhvi Kapoor) .

లక్ష్మి – ఐశ్వర్య:
ఒకప్పటి అందాల తార లక్ష్మి (Laxmi) కూతురే ఐశ్వర్య (Aishwarya). ప్రస్తుతం సపోర్టెడ్ రోల్స్ చేస్తున్నారు. తమిళంలో హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవి ఆడలేదు. దీంతో సపోర్టెడ్ రోల్స్ చేస్తున్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నాని, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుకున్నారు.

రాధ- కార్తిక, తులసి:
చిరంజీవి (Chiranjeevi)-రాధ (Radha) కాంబినేషన్ అంటే అప్పట్లో మెగా ఫ్యాన్స్ కి పొండగే. థియేటర్లు దద్దరిల్లిపోయేవి. వారిద్దరి కాంబినేషన్లో పాట వస్తే చాలు..కుర్రకారు ఊగిపోయేది. రాధ కి ఇద్దరు కుమార్తెలు. వారు కార్తిక, తులసి. కార్తిక నాయర్ నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ (Josh) లో హీరోయిన్ గా చేస్తే, తులసి నాయర్ మణిరత్నం వంటి డైరెక్టర్ తో కడలి (kaadhal) సినిమాలో హీరోయిన్ గా చేశారు.

జీవిత – శివాని, శివాత్మిక:
ఒకప్పటి హీరోయిన్ జీవిత (Jeevitaకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజశేఖర్ తో కలిసి ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరవాత నిర్మాతగా, దర్శకురాలిగా కూడా పలు సినిమాలు తీశారు జీవిత. తన పెద్ద కూతురు శివానీ (Shivani)ని ‘2 స్టేట్స్’ రీమేక్ తో పరిచయం చేయాలనుకున్నా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తన రెండో కూతురు శివాత్మిక మాత్రం ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ పలు సినిమాల్లో చేశారు.

సారిక – శృతిహాసన్, అక్షర హాసన్ :
లోక నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన కమల్ హాసన్ (Kamal Hassan) భార్య సారిక. ఈమె అప్పట్లో నటిగా హిందీ మూవీస్ లో బాగా రాణించింది. వారి కుమార్తె శృతిహాసన్ (Sruthi hassan ) తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

మంజుల – వనిత, శ్రీదేవి, ప్రీత :
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజులకి ముగ్గురు కూతుర్లు..వనిత, ప్రీత, శ్రీదేవి.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో వనిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ప్రీత రుక్మిణితో ఎంట్రి ఇచ్చారు. ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాల్లో నటించింది ప్రీత. ప్రభాస్ (Prabhas) డెబ్యూ మూవీ ఈశ్వర్ (Eswar) తో శ్రీదేవి పరిచయం అయింది. ప్రస్తుతం ప్రీత, శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. వనిత కొంతకాలం క్రితం మూడో పెళ్లి చేసుకున్నారు.

మేనక – కీర్తి సురేశ్:
కీర్తిసురేష్ ( Keerthi Suresh) తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. ఆమె చిరంజీవి (Chiranjeevi)తో కలిసి పున్నమినాగు (Punnami Nagu) సినిమాల్లో నటించారు. తొలుత మళయాళం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ‘మహానటి’ (Maha Nati) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

లిజి- కళ్యాణి ప్రియదర్శన్:
ఒకప్పటి స్టార్ హీరోయిన్ హీరోయిన్ లిజి (Heroine Lissy) గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఆత్మబంధం,20వ శతాబ్దం వంటి సినిమాల్లో సుమన్ సరసన హీరోయిన్ గా నటించింది.. ఆమె తన కూతురే కళ్యాణి ప్రియదర్శన్ (Kalyanai Priyadarshan). అఖిల్ (Akhil)డెబ్యూ మూవి ‘హలో’ (Hello) సినిమాతో ఎంట్రి ఇచ్చింది. ఆ తరువాత చిత్రలహరి, రణరంగంలో నటించారు. ఆ తరువాత చాన్స్ లు తగ్గడంతో సినిమాకు దూరమైంది.

