తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబర్చింది. 116 మున్సిపాల్టీలకు గాను 66 మున్సిపాల్టీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ ఒక్క మున్సిపాల్టీకూడా గెలుచుకోలేదు. 37 మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది.

కార్పొరేషన్లలో…
ఇక రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో రామగుండం, మంచిర్యాల, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ కు స్పష్టమైన ఆదిక్యం వచ్చింది. అంటే మేయర్ ను ఎన్నుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ సాధించింది. మిగిలిన కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కొత్త గూడెం కార్పొరేషన్లలో పవర్ పాటిలిక్స్ జరుగుతున్నాయి. అందులో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన, పెద్ద కార్పొరేషన్లపై కరీంనగర్, నిజాబామాబాద్ కార్పొరేన్లపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కరీంనగర్, నిజామాబాద్ లలో..
కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లలో బీజేపీ 30 గెలిచింది. కాంగ్రెస్ 14 గెలవగా, బీఆర్ఎస్ పార్టీ 9, ఎంఐఎం, 1, ఇతరులు 10 చోట్ల గెలిచారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు 28 బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 17 గెలవగా, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 14 గెలిచాయి.
పవర్ పాలిటిక్స్ మొదలు..
కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 66 సాధారణ సీట్లతోపాటు ముగ్గురు ఎక్ అఫిషియో మెంబర్ల సీట్లు కలిపితే మేజిక్ ఫిగర్ 35కి చేరింది. ఈ ఫిగర్ సాధించేందుకు పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఈ పవర్ పాటిలిక్స్ జరుగుతున్నాయి.

బీజేపీ దగ్గరైనా..
బీజేపీనుంచి 30మంది కార్పొరేటర్లు గెలిచారు. మేజిక్ ఫిగర్ సాధించాలంటే 35 కావాలి. ఇందులో 30 మంది కార్పొరేటర్లతోపాటే ఎక్ అఫిషియో సభ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు కలిపితే 31 అయింది. మరో నలుగురు కావాలి. వారిలో స్వతంత్రులు ముగ్గురు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీనుంచి విప్పల జ్యోతి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో 35 ఓట్లు సాధించిన బీజేపీకి మేయర్ పీఠం దాదాపు ఖరారైనట్టే అనిపించింది. అయితే విప్పల జ్యోతి అనూహ్యంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో బీజేపీ ఓట్ల సంఖ్య 34కి పడిపోయింది.
కాంగ్రెస్ పవర్ గేమ్..
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని సానుకూలతలు ఉంటాయి. ఆ రకంగానే కాంగ్రెస్ పవర్ గేమ్ మొదలుపెట్టింది. 14 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని గెలిచేందుకు పావులు కదిపింది. ఈ కాంగ్రెస్ నుంచి 14 మంది గెలిచారు. తొలుత బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు విప్పల సాయిజ్యోతి, బొట్ల శ్యామల ఆ తరువాత కాంగ్రెస్ క్యాంప్ కి చేరారు.దీంతో ఆ సంఖ్య 16కి పెరిగింది. ఇక ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ క్యాంప్ 23కి చేరింది.
ఇక బీఆర్ఎస్ క్యాంప్ లో 9 మంది కార్పొరేటర్లు, ఇండిపెండెంట్ సభ్యుడు 1 ఉన్నారు. అంటే వీరి సంఖ్య 10కి చేరింది.. బీఆర్ఎస్, బీఆర్ఎస్ కు చెరో ఎక్స్ అఫిసియో సభ్యుడి ఓట్లు ఉన్నాయి. వీటిని లెక్కిస్తే బీజేపీ వైరి పక్ష సభ్యుల సంఖ్య 35కి చేరింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను ఒప్పించి తటస్తుడైన కార్పొరేటర్ ని మేయర్ ని చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారట. అంటే బీజేపీకి మాత్రం మేయర్ పీఠం దక్కకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఒప్పుకుంటే అది సంచలనమే. అయితే ఒక వేళ అదే జరిగితే ఈ కలయిక రాష్టంలో రాజకీయ సమీకరణాలను మార్చుతుంది. అదే సమయంలో బండి సంజయ్ ను ఢీ కొట్టేందుకు ఇన్ని పార్టీలు ఒక్కటి అయ్యాయనే చర్చ కూడా మొదలవుతుంది. ఇదంతా బీజేపీయేతర పక్షాలన్న ఒక్కటై మేయర్ ను ఎన్నుకుంటేనే.
