క్లీంకారా.. శివరామ్..అన్వీరా దేవి.. మెగా (Chiranjeevi) కుటుంబంతోపాటు మెగా ఫ్యామిలీ అభిమానుల్లోనూ ఈ పేర్లు వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ (Ramcharan) భార్య కామినేని ఉపాసన (Upasana) ఇటీవల ట్విన్స్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఒక కుమార్తె. ఆమె పేరు క్లీంకారా. తాజాగా పుట్టిన ట్విన్స్ లో అబ్బాయి శివరాం అని, అమ్మాయికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు.
ఈ పేర్లే పెట్టడానికి కారణం ఏంటో చూద్దాం.
క్లీంకారా
మొదటి పాప పేరు క్లీంకారా. ఈ పేరు లలిత సహాస్రనామం నుంచి తీసుకున్నారు. ‘క్లీంకార’ (Klin Kaara) అంటే ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తనాత్మక, స్వచ్ఛమైన, పవిత్రమైన శక్తి అని అర్థం. ‘క్లిన్’ అంటే ఆదర్శవాదం, ఇతరులకు సహాయపడే స్వభావం. ‘కారా’ అంటే ప్రేమగల, స్వేచ్ఛాయుతమైన , స్వచ్ఛమైన అని అర్థం. మొత్తంగా అత్యంత పవిత్రమైన శక్తి అని చెప్పవచ్చు.
శివరామ్
ఇక అబ్బాయి పేరు శివరాం (shivaram). ఈ పేరును చిరంజీవి, రామ్ చరణ్ ల పేర్లలోనుంచి తీసుకున్నారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులోని శివ అనే పదాన్ని తీసుకున్నారు. రామ్ చరణ్ లోని ‘రామ్’ అనే పదాన్ని కలిపి శివరామ్ అని పేరు పెట్టారు. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఆది దేవుడిగా శివుడిని, ఆదర్శవంతంగా రాముడిని చూస్తాం. ఆ రెండింటిని కలిపి శివరామ్ అని పెట్టారు.
అన్వీరా దేవి
ఇక అమ్మాయి పేరు అన్వీరా దేవి (Anveeradevi). చిరంజీవి తల్లి పేరు అంజనా దేవి. ఇంగ్లీష్ లో Anjana devi. అందులోని ‘AN’ని తీసుకున్నారు. పురాణాల ప్రకారం చూస్తే అన్వీరా అందే అంతులేని ధైర్యం కలది అని అర్థం. అదే సమయంలో కరుణ చూపించే దేవత అని కూడా చెబుతారు. ఆ రెండింటినీ కలిపి అన్వీరా దేవి అని పేరుపెట్టారు.

న్యూమరాలజీ ప్రకారం
ఇక న్యూమరాలజీ ప్రకారం చూస్తే రామ్ చరణ్, ఉపాసన ల న్యూమరాలజీ ప్రకారం పిల్లలకు ఆ పేర్లను (స్పెలింగ్) పెట్టారట. ఈ కుటుంబంలోని వారి పేర్లను చూస్తే న్యూమరాలజీ ప్రకారం 3, 4, 5, 9 సంఖ్యలు ఉంటాయి. అవి చాలా శక్తివంతమైనవి, కీర్తి ప్రతిష్టలు తెస్తాయని చెబుతున్నారు.
ఈ పేర్లపై రామ్ చరణ్, ఉపాసన తమ తొలి అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అందులో వారు ‘ మాకు ఒక బాబు, ఒక పాప జన్మించిందనకు చాలా సంతోషిస్తున్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. వారు ఇంట్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది. మా జీవితాల్లో మహిళలే మాకు గొప్ప బలం. ప్రతి క్షణంలోనూ వారు మాకు అండగా నిలిచారు. మా శ్రేయోభిలాషులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ’ అని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Ram Charan and Upasana reveal twin babies a boy and a girl named Shivram and Anveera devi

