February 27, 2026

రేవంత్ కి అగ్ని పరీక్ష | Telangana municipal elections

తెలంగాణలో 116 మున్సిపాల్టీలకు, 7 కార్పొరేషన్లకు  ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఫిబ్రవరి 13న రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పేరుతో బయటకు వస్తున్న వివరాల ప్రకారం (ఎగ్జిట్ పోల్స్ Exit polls) నిజంగా చేశారా? అనేది వేరే అంశం) కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది. అంటే 116 మున్సిపాల్టీలో 80కిపైగా మున్సిపాల్టీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, 7 కార్పొరేషన్లూ కాంగ్రెస్ కైవసం అవుతాయని చెబుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ (Brs party) పార్టీకూడా తమకు వచ్చే స్థానాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది.

వాస్తవానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అది సహజం. అధికార పార్టీ గెలిస్తే తమ మున్సిపాల్టీ, తమ పంచాయతీ లేదా తమ మండలం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పాటు లేనిపోని సమస్యలు ఎందుకనే ఉద్దేశంతో తటస్థులు కూడా అధికార పార్టీకే ఓట్లు వేస్తారు. అయితే ఇక్కడే రేవంత్ కి అగ్ని పరీక్ష ఎదురుకానుంది.

ఎందుకంటే రేవంత్ (Revanth reddy) సర్కార్ రుణమాఫీ, మహిళకు ఉచిత  (free bus scheme)బస్సు, పొదుపు సంఘాలకు రుణాలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.  దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా నిలించింది. ఇక అభివృద్ధి కార్యక్రమాలపైనా భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేస్తే రికార్డు స్థాయిలో సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం 80కిపైగా సీట్లు (మొత్తం సీట్లలో 2/3 వంతులు/ 66 శాతం పైగా) వస్తే ఇబ్బంది ఉండదు. అంతకంటే తగ్గితే అది రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందే.

అవేంటో చూద్దాం.

రేవంత్ (Cm Revanth reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. మరో రెండున్నరేళ్లే సమయం ఉంది. మిగతా ఆరునెలలు ఎన్నికల హడావుడి సరిపోతుంది. అంటే దాదాపు సగం పదవీ కాలం పూర్తయినట్టే. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు తగ్గితే అది ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్లు భావించవచ్చు. ఇంకా రెండున్నరేళ్లలో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు  పెరుగుతుంది. అది అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది.

తేడా స్వల్పంగా ఉంటే..

ఎన్నికల్లో సీట్ల సంఖ్యతో పాటు ఓటింగ్ శాతం కూడా ముఖ్యమే. తెలంగాణ (Telangana) విషయానికి వస్తే కాంగ్రెస్ (congress కు, బీఆర్ఎస్ (brs)కు మధ్య పోటీ ఎక్కువ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో ఎంత ఎక్కువ వ్యత్యాసం ఉంటే అది కాంగ్రెస కు అంత మంచింది. అలా కాకుండా కాంగ్రెస్ కు-బీఆర్ఎస్ కు మధ్య వచ్చిన ఓట్ల శాతం 5 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వానికి అలర్ట్ బెల్ లాంటిది.

2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (అప్పట్లో టీఆర్ఎస్- TRS) దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్లలేకపోయింది. ఓట్ల శాతంలోనూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కంటే 10శాతం కంటే ఎక్కువే ఉంది. అయినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందింది. దీన్ని బట్టి సీట్ల సంఖ్యతోపాటు ఓట్ల శాతం కూడా కీలకమే అని చెప్పవచ్చు.

2020 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా

మొత్తం మున్సిపాలిటీలు – 120

బీఆర్ఎస్ – 112

కాంగ్రెస్ – 4

బీజేపీ – 2

ఎంఐఎం – 2

*

మున్సిపల్ కార్పొరేషన్లు – 10

బీఆర్ఎస్ – 9

కాంగ్రెస్ – బీజేపీ – 1 (మణికొండ)

ఈసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఫిబ్రవరి 13న తేలనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *