పబ్లిసిటీ స్టంట్ కి కొలమానాలు ఉండవు. ఏదైనా డిఫరెంట్ గా చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది. అది ఎవరికి నచ్చుతుంది..ఎవరికి నచ్చదు అనేది వేరే అంశం. అయితే ఆ క్రమంలోనే వేదికమీదే బూతులు మాట్లాడడం సాధారణం అనుకున్నాడేమో సదరు బుల్లితెర మెగాస్టార్ గా చెప్పే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. ఈ సారి ఏకంగా బూతులనే (సాధారణ భాషలో) పాటగా పాడారు. అదికూడా ఫిబ్రవరి 6న వచ్చే బరాబర్ ప్రేమిస్తా (Barabar Premistha) మూవీకి సంబంధించిన కార్యక్రమంలో.

బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాటిట్యూడ్ స్టార్ Chandrahas ఒక పాటను పాడాడు. ఆ పాటలో పచ్చి బూతులు ఉన్నాయి. అయితే అవి నిజంగా సినిమాలో ఉంటాయా.. లేక పబ్లిసిటీకోసం ఇలా చేశారా అనేది ఇంకా తేలలేదు కాని వేదికపైనే బూతుల పాట పాడడం విమర్శలకు కారణమైంది.
ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నా, ధీర్ఘకాలం సినిమారంగంలో ఉండాలన్నా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా సినిమాలు తీయకపోయినా ఇబ్బంది లేదు..కాని ఏవగించేలా చేయకూడదనేది టాలీవుడ్లో వినిపిస్తున్న మాట. అవేమీ పట్టించుకోకుండా బూతులను, తిట్లను కలగలిపి పాట (SONG) పాడారు చంద్రహాస్. దీంతో మరోసారి ట్రోలింగ్ (VIral news) మొదలైంది. దీని గురించి మూవీ (Movie) టీం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదే సమయంలో ఈ పాటలను చూసినవారు, విన్నవారు ఏం చెప్పాలో తెలియక నీకో దండంరా సామీ అని చెబుతున్నారు కూడా.

ఇక మూవీ విషయానికి వస్తే.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్ ఇండియా (Miss India) ఫైనలిస్ట్ మేఘన (Meghana) ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న (Feb 6) రిలీజ్ చేయబోతోన్నారు.
