ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా పట్టుదలతో పనిచేస్తుంది. కాని అధికారంలోకి వచ్చాక అదే పార్టీకి నిర్లిప్తత వస్తుంది. ప్రభుత్వంపైనా అది ప్రభావం చూపుంతోంది. తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ అంశంపైనా ఇదే జరిగింది.

తిరుమల లడ్డూ #Turumalaladdu లో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇస్తే..అందుకు భిన్నంగా YSRCP కల్తీ లేదని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఆరోపణల విషయంలో నివేదికలోని అంశాలు (అధికారికంగా ఇంకా నివేదిక బయటకు రాలేదు) తమకు అనుకూలంగా ఉన్నాయని సమాచారం అందగానే YSRCP పెద్ద యెత్తున ప్రచారం మొదలుపెట్టింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు TDPని, Janasenaను, Pawan Kalyan ని టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం కొంత వెనుకబడినట్టు అనిపిస్తోంది. ఇక TDPలోని కొందరు తప్ప మిగతా వారు ఈ అంశంతో తమకు సంబంధం లేదనట్లుగానే వ్యవహరించారు. Social media లోనూ అదే ధోరణి. ఇక Janasena పార్టీ కార్యర్తలు కూడా YSRCP ప్రచారానికి ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయారు.
వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే సోషల్ మీడియాలో వైసీపీని ఎదుర్కోవడం కష్టం కాదు. కాని అది జరగలేదు.
ఇక సిట్ (SIT)కు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం.
- వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చాయి.
- 2024 సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు (Supreme court of India)లో పిటిషన్లు దాఖలయ్యాయి.
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటైంది.
- 16 నెలలపాటు 10 రాష్ట్రాల్లో విచారణ చేసిన సిట్ ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏపైనా ఆరోపణలు వచ్చాయి.
- 2025 మేలో సిట్ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
- ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్, విపిన్ జైన్‌లను కీలక సూత్రధారులుగా గుర్తించింది. టీటీడీ తో సంబంధం ఉన్న పలువురిని నిందితులుగా చేర్చింది.
- తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, ఏపీలోని వైష్ణవి డెయిరీల లాలూచీని బహిర్గతం చేసింది.
- దాదాపు 600 పేజీల ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్‌లో సమర్పించారు.
- ముఖ్యంగా బోలే బాబా డైరీకి టీటీడీకి సరిపడా నెయ్యి సరఫరా చేసే అర్హత లేదని, అసలు ఆవులే లేవని తేల్చింది. బయట నుంచి పాలు సేకరించకుండా పామాయిల్‌లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేశారు. అలా తయారు చేసిన మిశ్రమాన్ని ఏఆర్ డైరీ , వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు రవాణా చేశారు. మొత్తంమీద 68 లక్షల కిలోల ఈ కల్తీ మిశ్రమంతో దాదాపు 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. ఇందుకు గాను రూ. 251 కోట్లు చెల్లింపులు జరిగాయి.
మొత్తంమీద ఈ అంశాలు సిట్ నివేదికలో ఉంటే వైసీపీ మాత్రం కల్తీ లేదని ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వం లో ఉండి కూడా జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం కొంత నిర్లిప్తంగా ఉన్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు కనిపించకపోవచ్చు..కాని ఇలాంటి నిర్లిప్తతే 2019నాటి పరిస్థితులకు కారణమైందన్న విషయం మర్చిపోకూడదు.
