స్టూడెంట్. 1 జూనియర్ ఎన్టీఆర్, గజాలా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీని రూ. 2కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది.
రెండో సినిమా సింహాద్రి. జూనియర్ ఎన్టీఆర్, భూమిక, అంకిత తదితరులు నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ బడ్జెట్ 8 కోట్లు కాగా 26 కోట్లు రాబట్టింది.

మూడో సినిమా సై. నితిన్, జెనీలియా నటించిన ఈ మూవీ హిట్ అయింది. 5 కోట్లతో సినిమా తీస్తే 9.5 కోట్లు వసూలు చేసింది.
నాలుగోది చత్రపతి. ప్రభాస్, శ్రీయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రికార్డులు సాధించింది. ట్రెండట్ సెట్టర్ . సూపర్ హిట్ అయింది. 10కోట్లతో తీసిన ఈ సినిమా 21 కోట్లు రాబట్టింది.
ఐదో సినిమా విక్రమార్కుడు. రవితేజ, అనుష్క నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 11 కోట్లతో సినిమా తీయగా 23 కోట్లు వసూలుచేసింది.
ఆరో సినిమా యమ దొంగ. రాజమౌళి– జూనియర్ ఎన్టీఆర్ కాబినేషన్లో ఇది మూడో సినిమా. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.18కోట్లతో తీసిన ఈ మూవీ 29కోట్లు వసూలు చేసింది.
ఏడో సినిమా మగధీర. రామచరణ్ , కాజల్ తదితరులు నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. ట్రెండ్ సెట్టర్. 44 కోట్లతో ఈ సినిమా తీస్తే.. 78 కోట్లు వసూలు చేసింది.
8వ సినిమా మర్యాద రామన్న. సునీల్, సలోని తదితరులు నటించిన ఈ మూవీ హిట్ అయింది. రెగ్యులర్ గా రాజమౌళి జానర్లలో ఇది భిన్నమైంది. 14 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ. 29కోట్లు వసులుచేసింది.
9వ సినిమా ఈగ. నాని, సమంత తదితరులు నటించిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ 26 కోట్లు కాగా 45 కోట్లు వసూలు చేసింది.
10వ సినిమా బాహుబలి. ది బిగినింగ్. దేశంలోనే అత్యదిక కలెక్షన్లు వసూలుచేసిన సినిమా ఇది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 136 కోట్లతో ఈ సినిమ తీస్తే ర.600కోట్లు వసూలు చేసింది. ఇవి కాకుండా 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
11వ సినిమా బాహుబలి. ది కన్ క్లూజన్.బాహుబలి 1కి మించి కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటింటి. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 250కోట్లతో సినిమా తీస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 380 కోట్లు, కలెక్షన్లు 854 కోట్లు రాబట్టింది.
12వ సినిమా RRR. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. 550 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తీస్తే 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 1300కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు తెలుగులో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ కూడా ఇదే.
ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా తీస్తున్నారు రాజమౌళి. ఇది 2027లో రిలీజ్ కానుంది. అయితే దీని బడ్జెట్ ఎంత అనేది అఫిషియల్ గా క్లారిటీ లేనప్పటికి రూ. 1200కోట్ల పైగానే ఉందని చెబుతున్నారు.
ఇవి కాకుండా రాజన్న సినిమాను వి. విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించగా, ఆయన కుమారుడు రాజమౌళి ఆ సినిమాలోని పోరాట సన్నివేశాలను డైరెక్ట్ చేశారు.
సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2016లో పద్మశ్రీ అందుకున్నారు రాజమౌళి.
మగధీర, ఈగ సినిమా, బాహుబలి సినిమాలకు నంది పురస్కారం దక్కింది.
