March 1, 2026
kcr gets emotional before SIT enquiry in Phone Tapping case

కలలో కూడా అనుకోలేదన్న కేసీఆర్.. భావోద్వేగం

నందినగర్ కేసీఆర్ (KCR) ఇల్లు.. ఎప్పుడూ సంచలనాలకు వేదికే. ఆనాడు తెలంగాణ (Telangana) ఉద్యమంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఇక్కడినుంచే పరుడు పోసుకున్నాయి. కీలక నిర్ణయాలుకూడా ఇక్కడినుంచి వచ్చాయి. అయితే తాజాగా నందినగర్ లోని కేసీఆర్ ఇల్లు మరో అంశానికి వేదికైంది. అందుకే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping case) సిట్ అధికారులు కేసీఆర్ ను విచారిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫాస్ హౌస్ లో విచారణకు సహకరిస్తానన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ (SIT) అధికారులు తిరస్కరించడంతో ఆదివారం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు.

 

మధ్యాహ్నం 3గంటల సమయానికి, అంటే విచారణ ప్రారంభానికి ముందు కేసీఆర్ తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. అయితే ఇది ప్రత్యేక మీటింగ్ అనేకంటే కూడా లంచ్ మీట్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర భావోద్వానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబున్నాయి.

తన నందినగర్ ఇంట్లో పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ (KCR) చెప్పిన అంశాలు, పంచుకున్న అనుభవాలు, భావోద్వేగానికి గురిచేసిన అంశాలు ఇవీ. ఈ మాటలు చెబుతూ కేసీఆర్ భావోద్వేగానికి గురైన తీరు అక్కడున్న కొందరు నాయకులను కంటతడి పెట్టిందని  BRS పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

  • ఈ ఇంటినుంచే ఉద్యోగానికి ఊపిరి పోశా.

  • ఉద్యమ రచన కూడా ఇక్కడినుంచే జరిగింది.

  • ఎన్నో సంచలన నిర్ణయాలు ఇక్కడినుంచే తీసుకున్నా.

  • కఠినమై పరీక్షలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డా.

  • ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.

  • ఇదే గదిలో ఎంతోమందితో వందల చర్చలు జరిపా.

  • Telangana రాష్ట్ర సాధనకు ఎన్నో ఒత్తిడులు ఎదురైనా ఇదే ఇంట్లో ఉండి రాష్ట్రాన్ని సాధించా.

  • ఉద్యమ రచన చేసిన ఈ ఇంట్లో ఇప్పుడు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.

  • ఈ పరిస్థితిని కలలో కూడా ఊహించలేదు.

ఈ అంశాలను నాయకులతో మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు నాయకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *