Mon. Dec 5th, 2022

తూప్రాన్ : తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలౌతుందని నిరూపిస్తే నిర్మలా సీతారామన్ తప్పును ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు. రేషన్ షాపు ముందు ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని కామారెడ్డి జిల్లాలో సీతారామన్ అధికారులను నిలదీసిన నేపథ్యంలో హరీష్ రావు స్పందిస్తూ.. దేశానికి అన్నం పెడుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని.. ఆ లెక్కన కేంద్రంలో కేసీఆర్ ఫొటో పెడతారా అంటూ వ్యాఖ్యానించారు.పేదలకు ఉచితంగా ఇచ్చే బియ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 3 వేల 600 పది కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్లే ఆదాయం ఎక్కువ. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తక్కువ అని విమర్శించారు. బీజేపీ వాళ్ళు చెప్పేవన్నీ బోగస్ మాటలను మండిపడ్డారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు మొత్తం అబద్దాలు మాట్లాడు తున్నారని.. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో ఒక ఎకరాకు సాగునీరందలేదని పచ్చి అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దివాలాకోరు,దిక్కుమాలిన రాజకీయాలు ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పించారు. రైతు బంధు, రైతుభీమా పథకాలు తెలంగాణవి కాగా..కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి పేరు మార్చమని అనడం హాస్యాస్పదమన్నారు. ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఫసల్ భీమా ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.