Mon. Dec 5th, 2022

పార్లమెంట్ శీతకాల సమావేశాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఎంపీలు లేవనెత్తగా అందుకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ మధ్య తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏర్పడిన వివాదంపై పార్లమెంట్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని నిన్నటి వరకు టీఆరెస్ ఎంపీలు ఆందోళన చేశారు. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు ప్రకటించారు.

అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ టీఆరెస్ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం మినహా సమస్యను పరిష్కారానికి దారి చూపడం లేదు. ఇందులో బుధవారం మరోసారి ధాన్యం కొనుగోలుపై తీవ్రంగా చర్చ సాగింది.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారి. టీఆరెస్ ఎంపీలు ఇక్కడ డ్రామా చూపిస్తున్నారని ఆ తర్వాత ఏం మాట్లాడకుండా సమావేశాలు బహిష్కరించారన్నారు.

ఉత్తమ్ లేవనెత్తిన అంశాలపై కేంద్రం ఆహార మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఉత్తమ్ లేవనెత్తిన అంశానికి ప్రస్తుతం నడుస్తున్న చర్చకు ఎలాంటి సంబంధలేదని వరిధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పారు.

కేంద్రం ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వంనుంచి కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ సరఫరా విషయంలో విఫలమైంది. ఈ విషయంపై ఇప్పటికే విధివిధానాలను ఆ రాష్ట్ర సీఎంకు చెప్పామని చెప్పారు.

ఇక రాజ్యసభలోనూ రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ డిమాండ్ చేయగా…కనీస మద్దుతు ధర కల్పించాలని బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులపై ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేసేందుకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడారు. రైతులు సామాన్యులను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఓ వైపు నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహారిస్తోందన్నారు.

ఇక రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక సస్పెండ్ అయిన ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.