Mon. Dec 5th, 2022

ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందుకు ఇంకా సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ మూవీకి బజ్ తీసుకురావడంలో వెనకబడిందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ కు సిద్ధం అవుతున్నారు. ట్రైలర్ ను మెట్రోపాలిటన్ నగరాల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈనేపథ్యంలో రాధేశ్యామ్ యూనిట్ కూడా పెద్దెత్తున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈనెల 17న రాధేశ్యామ్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ తేదీకి ట్రైలర్ రెడీ కాకపోతే అదే నెల 21న విడుదల చేయాల్ని ప్రత్యామ్నాయ తేదీగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత ప్రచారారన్ని మరింత స్పీడప్ చేయనున్నారు.

ఆ మధ్య బాహుబలి పబ్లిసిటీ స్టంట్ అధనాతన స్ట్రాటజీ వెనక జక్కన్న ఉన్నారు. కాబట్టి పనులన్నీకూడా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడా బాధ్యతలను చిద్ర దర్శకుడు రాధాక్రుష్ణకుమార్ చూసుకోవాలి. సాహో వైఫల్యం నేపథ్యంలో రాధేశ్యామ్ ను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఈ యంగ్ మేకర్ పై ఉంది. అయితే ఇప్పటికే ఇంగ్లీష్ భాషలోప్రభాస్ ఇంట్రోకి సంబంధించిన శాంపిల్ టీజన్ వదిలారు కానీ జనాలు దాన్ని అంతగా పట్టించుకోలేదు. పైగా విమర్శల్ని మూగగట్టుకోవాల్సి వచ్చింది.

మరి ఈ లెక్కటన్నింటిని ట్రైలర్ సరి చేయాల్సి ఉంటుంది. ఇది రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ కాబట్టి ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఆ అంచనాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ పై ఉంది.

By Admin

Leave a Reply

Your email address will not be published.