Mon. Dec 5th, 2022

వారంతా కూడా పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మందుబాబులు. తమ రాష్ట్రంతో పోల్చి చూస్తే పక్క రాష్ట్రమైన తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని తాగేందుకు అక్కడికి వెళ్తుంటారు. అక్కడ కాస్త తాగి….కొన్ని సీసాలను కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ మంగళవారం ఆ మందు బాబులు ఒక్కసారిగా కౌసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరిచారు.

ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో మద్యం తాగి తిరిగి వెళ్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఎందుకు చెస్తున్నారన్న సందేహం వస్తుంది కదా. దానికో కారణం ఉంది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగింతలు పెరిగాయి. ఎందుకంటే మద్యపానకట్టడి కోసమేనని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరలు పెంచితే జనాలు అంత డబ్బు చెల్లించడం కష్టంగా మారి తాగడం మానేస్తారనేది ప్రభుత్వం ఉద్ధేశ్యంగా కనిపిస్తోంది.

మందు బాబులకు ఎన్నో దారులు. అందుకే ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరులో వైన్ షాపు దగ్గరకు కర్నూలు జిల్లాలోని సమీప ప్రాంతాల ప్రజలు వచ్చారు. మద్యం తాగి…కొన్ని సీసాలు కొనుక్కోని వెళ్లారు.

అయితే వైన్ షాప్ సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర ఉండవెల్లి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ చేపట్టారు. దీంతో మందుబాబులకు చిర్రెత్తుకొచ్చింది. వైన్ షాప్ దగ్గర తనిఖీలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనంతటికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమంటూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదీ మందుబాబులు చేసిన నినాదాల వెనకున్న అసలు కారణం.

By Admin

Leave a Reply

Your email address will not be published.