Mon. Dec 5th, 2022

డైవర్స్ తర్వాత హీరోయిన్ సమంత మొదటిసారిగా తన పర్సనల్ లైఫ్ గురించి నోరువిప్పింది. ఈ మధ్య ఓ బాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడారు. 2021లో తన లైఫ్ లో చోటుచేసుకున్న విషయాల కారణంగా తన కలలన్నీ చెదిరిపోయానన్ననది.

విడిపోయిన తర్వాత చాలా బాధపడ్డానని చనిపోతాన అనుకున్నానని…ఇంత స్ట్రాంగ్ ఉంటాను అనుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ట్రోలింగ్ పై కూడా సామ్ స్పందించింది.

సోషల్ మీడియా నటీనటుల్ని తమ ఫ్యాన్స్ కు చేరువ చేసేందుకు చాలా ఉపయోగపడుతుందని సామ్ అభిప్రాయపడింది. కొంతమంది నెటిజన్ల నుంచి ఆధారభిమానాలు పొందుతున్నానని ప్రస్తుతం వాళ్లు తన జీవితం భాగమయ్యారని తెలిపింది. అయితే కొంతమంది మాత్రం అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నేను చేసే ప్రతి విషయాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను…భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండమని నేనే అందర్నీ ప్రోత్సహిస్తుంటాను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను అని సమంత తెలిపారు. ప్రస్తుతం సమంత ఇంటర్వ్యూకు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేటి విషపూరిత సోషల్ మీడియా ఎకోసిస్టమ్ లో ఫ్యాన్స్ గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాడి రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఏదీ దానంతట అదే జరిగదు..వారి అభిమానులు చివరికి వారిని కూడా కాటేస్తారని స్టార్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమని ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి అని ట్వీట్ చేశారు.

సిద్ధార్థ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుంచి పెద్దెతున రెస్సాన్స్ వస్తోంది. అదే సమయంలో సిద్ధార్థ్ పోస్టు సమంతను ఉద్యేశించే చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పిన దానికి కౌంటర్ గా సామ్ పెంచిపోషించిన ఫ్యాన్సే ట్రోల్ చేశారనే విధంగా అర్థం వచ్చేలా సిద్ధార్థ్ ట్వీట్ ఉందంటున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.