Fri. Feb 3rd, 2023

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విన్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఇంకొంచెం ఆలోచిస్తే…అస్సలు జీర్ణించుకోలేనంత వికారంగా మారింది ఈ ఉదంతం.

ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో గుర్తుతెలియన వ్యక్తి మ్రుతదేహం కనిపించింది. ఆ నోటా ఈ నోట పడటంతో అందరికీ తెలిసింది. వాటర్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బందికి డెడ్ బాడీ కనిపించడంతోఒక్కసారిగా ఖంగుతిన్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకర్ లోకి శవం ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేపట్టారు.

అనుకోని విధంగా వచ్చిందా…లేదా ఎవరైనా వాటర్ ట్యాంక్ లో పడేసారా…అన్నది ప్రశ్నగా మారింది. జలమండలికి చెందిన ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్లో శవం ఉందన్న విషయాన్ని గుర్తించిన విషయం చుట్టుపక్కల అంతా పాకింది. దీంతో ఘటనాస్థలానికి స్థానికులు పెద్దెత్తున చేరుకుంటున్నారు.

అయితే ఎన్ని రోజుల క్రితం డెడ్ బాడీ ట్యాంక్ లోపడిందన్నది ప్రశ్నగా మారింది. శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చే వాటర్ తాగుతున్న ప్రజలుఆందోళనకు గురవుతున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.