Mon. Dec 5th, 2022

తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న వైమానికదళ హెలికాప్టర్ కూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు 13మంది మరణించారు. ఈ ఘటన యావత దేశాన్ని కదిలిస్తోంది.

సోషల్ మీడియాలో బిపిన్ రావత్ కు నివాళులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు తరాల ఆయన కుటుంబం దేశ సేవకు అంకితమైంది. ఈ వార్త తెలిసి మరింత విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే దుర్ఘటనలో చిత్తూరు జిల్లా కురబలకోట యువకుడు సాయితేజ ప్రాణాలు కోల్పోయాడు. రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వహిస్తున్నారు. జనరల్ బిపిన్ కు సాయితేజ వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహారిస్తున్నారు.

సాయితేజ 1994లో జన్మించారు. 2013లో సాయితేజ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయితేజ ముగ్గురు సోదరుల్లో ఇద్దరు ఆర్మీలోనే ఉన్నారు. పిల్లల చదువు నిమిత్తం నివాసాన్ని మదనపల్లికి మార్చారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.