Fri. Feb 3rd, 2023

అందమైన అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ చేయాలని ఉందా. అయితే గోల్డ్ మెంబర్ షిప్ తీసుకుంటే హోటల్ బుకింగ్…మీరు ఇచ్చే అమౌంట్ ఆధారంగా మస్త్ మజా అంటూ అందమైన అమ్మాయిలో ఫోటోలతో బోల్తా కొట్టిస్తూ లక్షలకు లక్షలు లాగేస్తున్నారు కేటుగాళ్లు. ఈ డేటింగ్ పేరుతో మోసగాళ్ల బారిన పడ్డారంటే అంతే…ఫిగర్ కాదు…జేబులు గుల్ల కావడం ఖాయం.

పశ్చిమబెంగల్ జోద్పూర్ కు చెందిన ఆనంద్ పరగణాల జిల్లాలోని చైతన్యపూర్ సౌత్ లోనివసించే బుద్దదేవ్ పాల్ వంటి యువకులను టార్గెట్ చేసుకుని వారిని షోన్ ఫోన్ డేటింగ్ యాప్స్ ద్వారా సంప్రదించారు. మా క్లబ్ లో చేరండి…అందమైన అమ్మాయితోడేటింగ్ చాటింగ్ చేయవచ్చని వల విసిరారు.

అందమైన హాట్ హాట్ ఫోటోలను వాట్సాప్ పంపిస్తారు. అంతేకాదు గోల్డ్ మెంబర్ షిప్ లో చేరితే హోటల్లో రూం కూడా బుక్ చేస్తామంటూ ఊరిస్తుంటారు. ఒక్కదానికో ఒక్కో రేటు చెప్పి లక్షల వసూలు చేస్తారు. ఇదంతా ఆన్ లైన్ ద్వారా నడుస్తుంటుంది.

డేటింగ్ మెసేజ్ అంటూ పంపితే స్పందించిన పాపానికి ఈ ముఠా వలలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తంగా బుక్కయ్యాడు. అమ్మాయిలను సరఫరా చేస్తామని…వారితో డేటింగ్ చేయించవచ్చని నమ్మబలికి 48వేలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో నగరవాసి తనకు అన్యాయం జరిగిందని హైదరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇలా ఫోన్ కు వచ్చిన మెసేజ్ లకు మీరు టెంప్ట్ అయిపోయారో అంతే సంగతులు. ఇలాంటి మెసేజ్ ల వల్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.