Mon. Dec 5th, 2022

భారత త్రివిధ దళాల తొలి అధిపతి…బిపిన్ రావత్ మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులు దుర్మరణం చెందినట్లు వాయిసేన తాజాగా ప్రకటించింది. భారత సైనిక చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో 14మందిలో 13మంది దుర్మరణం చెందారు. రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వీఎఫ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో మొత్తం 13మంది మరణించారు.

ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరి శరీరాలు గుర్తించడం చాలా కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా డెడ్ బాడీలు గుర్తించనున్నరు. కాగా ప్రయాణ సమయంలో హెలికాప్టర్ లో 14 మంది ఉండగా…జీవించి ఉన్న ఆ ఒక్కరూ సీడీఎఫ్ బిపిన్ రావత్ అని సమాచారం.

రావత్ ను పోలీసులు దుప్పటిలో తీసుకెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూస్తే రావత్ తీవ్ర గాయాలయ్యారు అని అర్థం అవుతోంది. ఇక ప్రమాదం గురించి ప్రత్యక్షసాక్షి చెబుతున్న వివరాలు కూడా ఉన్నాయి.

బిపిన్ రావత్ స్థాయి అధికారి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానిక గురికావడం చూస్తుంటే..ఇది భారత సైనిక చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటనగా భావిస్తున్నారు. అంతేకాదు..ఎంఐ17వీ5 హెలికాప్టర్ వీవీఐపీలు ప్రయాణించేందుకు ఏర్పాటు చేస్తారు.

రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్ సైనిక రవాణా విమానం. ఆముధ సహితంగా ఈ హెలికాఫ్టర్ ఉంటుంది. ఈ దుర్ఘటనకు కారణం పొగమంచని భావిస్తున్నారు. శీతాకాలం కావడంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణం కావడం పొగమంచి దెబ్బతీసింది. ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని తెలుస్తుంది.

By Admin

Leave a Reply

Your email address will not be published.