Mon. Dec 5th, 2022

యువ యూట్యూబర్ నటి శ్రియా మురళీధర్ గుండెపోటుతో మరణించడం..కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె తుది శ్వాస విడిచింది.

ఊహించనవిధంగా చిన్నవయస్సులోనే 27 ఆమె గుండె జబ్బుకు గురికావడం పలువురిని కలచివేసింది. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు మాటీవీలో నిర్వహించిన పెళ్లిచూపులు రియాల్టీ షోలో శ్రియా మురళీధర్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఆ షో తర్వాత చాలా ఫేమస్ అయ్యారు.

పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. బ్యూటీ అండ్ ద బాస్ వెబ్ సీరిస్ లోనూ శ్రీయా నటించారు. ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయెన్సర్ గా శ్రియా అందర్నీ మెప్పించారు.

యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టపడే శ్రియా మురళీధర్ హైదరాబాద్ లోని లక్డీకపూల్ లో పుట్టి పెరిగారు. వాట్ ద ఫన్ యూట్యూబ్ ఛానెల్లో ఆమె పలు వీడియోలు చేసి మంచి గుర్తింపు పొందారు.

బిగ్ స్క్రీన్ పై రాణించాలన్న కలలుగన్న శ్రియాకు ఈ మధ్యనే సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయట. కానీ ఆ కల నెరవేరకుండానే శ్రియా గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.

By Admin

Leave a Reply

Your email address will not be published.