Mon. Dec 5th, 2022

ఈ భూమ్మిదకు వచ్చేటప్పుడు కులం…వెళ్లేటప్పుడు వెంటరాదని తెలుసు. అయినా మన దేశంలో కులానికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందో తెలుసు. కాలం మారినా…తరాలు మారుతున్నా…ప్రపంచం గ్లోబల్ రంగంలోదూసుకుపోతున్నా ప్రేమ పెళ్లిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్నాయి నేటి కుటుంబాలు.

ఎవరి భావోద్వేగాలు వారివి. అంతేకానీ ప్రేమ వివాహం చేసుకుందని..రాక్షసంగా వ్యవహరించడం ఏమాత్రం కరెక్టు కాదు. ఈ ఉదంతం గురించి వింటే…ఇంతటి రాక్షసులు కూడా ఉన్నారా అన్న సందేహం కలుగక మానదు. మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన మానవత్వం లేకుండాపోయింది. అత్యంత అమానుషంగా వ్యవహరించిన తీరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో జరిగింది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం వివరాలు వింటే ఉలిక్కిపడటం కాదు..ఈ హింస మనల్ని డిస్ట్రబ్ చేయడం ఖాయం.

ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో చెల్లె తల నరికాడు అన్న. ఆ రాక్షసుడికి తల్లి అండగా నిలిచింది. నమ్మకంగా మాట్లాడి…కళ్లబొళ్లి మాటలు చెప్పి తమ ప్రేమను అంగీకరించామని ఆశలు కల్పించి దారుణంగా హతమర్చారు.

ఔరంగాబాద్ గోయే గావ్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల క్రుతి…అవినాశ్ థోరేను ఇష్టపడింది. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఆరు నెలల క్రితం ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రేమించినోడిని మనువాడింది. వారు లడ్గావ్ లో కాపురం పెట్టారు.

కొద్దిరోజుల క్రితం క్రుతిని ఆమె తల్లి కలిసింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని…ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లుగా చెప్పింది. ఆదివారం అన్నను తీసుకుని వస్తాయనని క్రుతికి చెప్పింది. చెప్పినట్లుగానే వారు వెళ్లారు. మాట్లాడాక టీ పెట్టేందుకు క్రుతి వంటింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఆమె భర్త వేరేగదిలో ఉన్నాడు. టీ పెడుతున్న క్రుతి దగ్గరకు వెళ్లిన తల్లి, అన్న మాటలు చెబుతున్నారు.

వారు ఇంటికి వచ్చిన సంతోషంలో ఆమె ముంచుకొస్తున్న ముప్పును ఊహించలేదు. టీ పెడుతున్న క్రుతిని తట్టి గట్టిగా పట్టుకుంది. సోదరుడు దాడి చేసి తల నరికాడు. భార్య కేకలు పెట్టడంతో బయటకు వచ్చిన ఆమె భర్త…జరిగిన దారుణాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. అతడిపై దాడికి ప్రయత్నించగా పారిపోయాడు.

ఇదిలా ఉంటే..తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో క్రుతి తల నరికి దాన్ని పట్టుకుని బయటకు వచ్చిన తల్లికొడుకు వీరంగం చేశారు. సెల్ఫీలు దిగుతూ రాక్షసానందం పొందారు. తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇంత దారుణంగా వ్యవహించడమా అని పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

By Admin

Leave a Reply

Your email address will not be published.