Mon. Dec 5th, 2022

అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఉదయం నుంచే సోషల్ మీడియలో పుష్ప ట్రైలర్డే అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ట్రైలర్ కోసం వేచిస్తున్న అభిమానులకు ఆరుగంటల మూడు నిమిషాలైంది. ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. ఫ్యాన్స్ లో ఒక్కటే ఉత్కంఠ. మరింత వెయిటింగ్ పెరిగింది. అయినా ట్రైలర్ రిలీజ్ కాలేదు. కానీ ట్విట్టర్ లో పుష్ప ప్రొడ్యూసర్లు ఓ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని చెప్పారు. కొన్ని కారణాలతో ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని తెలిపింది. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం..అని తెలిపారు. అయితే ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నరన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఆలస్యమైనా ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా మరో రోజుకు వాయిదా వేస్తారా అనేది సస్పెన్స్ లో పెట్టారు. దీంతో అభిమానుల్లో మరింతగా ఉత్కంఠ పెరిగింది. రిలీజ్ విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.