ఎలా బతికామన్నది…మనం పోయాక తెలుస్తుంది. ఇది వాస్తవం. ఎంతో మంది పుడుతారు…మరణిస్తారు. కానీ కొంతమంది మాత్రమే చనిపోయినా బతికే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఈ మధ్యే హార్ట్ ఎటాక్ మరణించారు. ఇంత చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అభిమానులు పునిత్ ను ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. అప్పు లేడన్న విషయాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎలాంటి పేరును ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయాలో ప్రపంచానికి చాటిచెప్పిన ఏకైక వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. ఆయన 18 వంది మందికి విద్యను అందిస్తున్నారు. ఎంతోమంది వ్రుద్దుల కోసం ఆశ్రమాలన్ని కట్టించారు. వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టారు. అప్పు మరణించేంత వరకు ఈ విషయం ప్రపంచానికి తేలియలేదంటే ఆయన ఎంత గొప్ప మనిషో అర్థం అవుతుంది. ఆయన మరణించి 39రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో పునీత్ నటించిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గంధదగుడి టైటిల్ టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు.
ఈ మూవీ డాక్యుమెంటరీ. దీని గురించి అక్టోబర్ 27 అంటే పునీత్ మరణించే రెండు రోజుల ముందు తాను స్వయంగా వివరించారు. ఓ ఫోటోను కూడా షేర్ చేస్తూ ఈ ప్రాజెక్టు గురించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పక్క హీరోగా యాక్ట్ చేస్తునే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని నిర్మించారు. గంధదగుడి డాక్యుమెంటరీని అమోఘ వర్ష జెఎస్ తో కలిసి చేశారు. ఇది అప్పుకు స్పెషల్..ఓ విధంగా చెప్పాలంటే పునీత్ డ్రీమ్ ప్రాజెక్టు ఇది.
ఈ డాక్యమెంటరీ టైటిట్ టీజర్ చూసినవాళ్లంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పు లేరంటే ఇప్పటికే ఎవరు నమ్మడం లేదు.