Mon. Dec 5th, 2022

మెగా డాటర్ నిహారిక-తన భర్త చైతన్య స్పెయిన్ అందాల మధ్య విహరిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కోస్టాస్ బీచ్, అద్భుతమైన రోమన్ శిథిలాల మధ్య ఈ జంట దిగిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తాజాగా నిహారిక నిన్న పెద్ద సాహసమే చేసింది.

స్కైడైవింగ్ విజయవంతంగా పూర్తి చేసిన నిహారిక తనలోని దైర్య సాహసాల్ని ప్రపంచానికి చాటి చెప్పింది. రెండు రెక్కల పక్షిలా గాల్లో తేలింది. మబ్బుల్లో స్వేచ్చగా విహరించింది. స్కైడైవింగ్ డ్రెస్ ధరించి మబ్బుల్లో కలిసిపోయింది. ఆమెతోపాటుగా ట్రైనర్ కూడా ఉన్నారు.

తాజాగా ఆ వీడియోని ఇన్ స్టాలో ఫ్యాన్స్ కు షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిహారిక వీడియోని ఉద్దేశిస్తూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. స్కైడైవింగ్ అబ్బాయిలే కాదు…అమ్మాయిలూ చేస్తారు అని క్యాప్షన్ ఇచ్చింది. చివరిగా ల్యాండ్ అయ్యే మూమెంట్ లో ఆపండ్రోయ్ ఒక్క క్షణం అంటూ వ్యాఖ్యానించింది.

ఇక నిహారిక చైతన్య మొదటి పెళ్లి రోజును డిసెంబర్ 9న గ్రాండ్ గా జరుపుకోనున్నారు. దీనిలో భాగంగానే స్పెయిన్ టూర్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

By Admin

Leave a Reply

Your email address will not be published.