Mon. Dec 5th, 2022

రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడంలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీరు అత్యంత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే రైతులకు క్షమాపణ చెప్పారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

యాసంగిలో వరికి బదులుగా రైతులు ఖచ్చితంగా ఇతర పంటలను వేయాలని ఆయన చెప్పారు. ఇతర పంటలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేశారు.

రైతుల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో టీఆరెస్ ఎంపీలు పోరాడుతున్నారన్నారు. ఎంత నిరసన తెలియజేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా రైతులను దేశాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

ఇక అటు ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో మంత్రులుర, ఎంపీలు పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు అంశలపై పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆరెస్ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నా..కేంద్రమంద్రి పీయూష్ గోయల్ ఇదే అంశంపై వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలి…ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న సందర్భంలో వారితో ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రధానం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

By Admin

Leave a Reply

Your email address will not be published.