Mon. Dec 5th, 2022

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ కలకలం రేపుతోంది. తాజాగా రాజస్థాన్ లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి ఈ వైరస్ నిర్దారణ అయ్యింది. ఒకేసారి ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

జైపూర్ ఆదర్శ్ నగర్ లోని ఓ కుటుంబంలోని వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో తొమ్మిది కేసులు బయటపడ్డాయి. వారందరూ కూడా కొద్ది రోజుల కిందటే దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చారు. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న ప్రాంతంలో కర్ఫ్యూను విధించింది.

ఇక ఇండియాలో ఇప్పటివరకు 21 ఒమిక్రాన్ కేసుల నమోదయ్యాయి. ఇంతకు ముందే మహారాష్ట్రలోని పూణేలో కొత్తగా ఏడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

By Admin

Leave a Reply

Your email address will not be published.