Mon. Dec 5th, 2022

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగన రనౌత్ ఈ మధ్య కాలంలో బీజేపీకి మౌత్ పీస్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున మీరు పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ బృందావన్‌లోని శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కంగన సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున మీరు ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు కంగన స్పందించింది. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేసింది.

జాతీయవాదాన్ని అనుసరించే వారి తరపున తన ప్రచారం ఉంటుందన్నారు. తనపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు బాధించాయన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు నిజమైన శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూపిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థానంలో ఈద్గా ఉందని కంగనా పేర్కొన్నారు.

చండీగఢ్‌లో రైతులు తన కారును అడ్డుకోవడంపై స్పందించారు. తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని తెగేసి చెప్పారు. దానిని తాను నిరసిస్తూనే ఉంటానని కంగన స్పష్టం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.