Mon. Dec 5th, 2022

దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో యుద్ధానికి సై అంటున్నాయి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు. ఎల్లుండి నుంచి దశలవారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.

ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు పెంచల్ రెడ్డి, పెంచలరావులు తెలిపారు. జిల్లాలోని ఎన్జీవో, హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.

సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, కరువు భత్యంతో సహా పలు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఏపీ జేఏసీ తెలిపింది. ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోని యేడల తమ ఆందోళనలను మరింత ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.