Mon. Dec 5th, 2022

జగన్ సర్కార్ కు మోడీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నుంచి తెచ్చుకున్న అప్పును సకాలంలో చెల్లించకపోవడంతో కేంద్రం ఊహించని షాకిచ్చింది. సకాలంలో అప్పు చెల్లించని ఏపీ జెన్ కోను నిరర్దక ఆస్తుల జాబితాలో చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ సర్కార్ నెత్తి మీద పిడుగు పడ్టట్లైంది.

జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేర్చడమంటే…తర్వాత ప్రతి అడుగులో ప్రైవేటీకరణ చేయడం అవుతుంది. ఇదే జరిగినట్లయితే ఏపీకి తీవ్ర నష్టం జరగనుంది. అప్పు నిప్పుతో సమానం అనే నానుడి ఉంది. అప్పు చేయటం అన్నది అభివ్రుద్ధిలో భాగమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేతలు తమకు తగ్గట్లుగా అప్పుడప్పుడు కొత్త తరహాగా సూత్రీకరిస్తారు. కానీ అప్పుతో ఎప్పటికే తిప్పలే. రెండు చేతులా సంపాదిస్తున్నంత వరకు అప్పుల్ని తీర్చడం పెద్ద కష్టం కాదు. కానీ చేసిన అప్పుకు వాటిని తీర్చేందుకు చేతిలోకి చిల్లి గవ్వ రానప్పుడే సమస్యలు తీవ్రం అవుతుంటాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా దెబ్బతిన్నది. బంగారు బాతులాంటి హైదరబాద్ మహానగరం తెలంగాణకు వరంగా మారితే…ఏపీకి శాపంగా మారింది. దీంతో జగన్ సర్కార్ అప్పుల మీద అప్పులు చేస్తోంది.

సంక్షేమ పథకాలు కోసం అప్పులు తెచ్చి వినియోగించటం ఇప్పుడు మరో సమస్యగా మారింది. పలువురు సీనియర్ నేతలు, ఆర్థిక రంగానికి చెందినవారు జగన్ సర్కార్ ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీటన్నింటికి తోడుగా జగన్ సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచీ అప్పులు పెరుగుతూనే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అప్పులు చేస్తుంటే…పెద్దెత్తున అభ్యంతరం చెప్పిన జగన్…తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు రెట్టింపు అప్పు చేస్తున్నారు.

అంతేకాదు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతున్నారు. ఏపీ విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్, ఇంకా చెప్పాలంటే ఏపీ జెన్ కో కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి గతంలో అప్పు తీసుకుంది. వాటిని చెల్లించలేదు. గత మూడు నెలలుగా గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అప్పులు తీర్చలేదు. పలుసార్లు అడిగినా పట్టనట్లే వ్యహరిస్తోంది. దీంతో కేంద్రం కన్నెర్ర చేసింది. అప్పు తీర్చాల్సిన వాయిదా గడువు పూర్తయిన తర్వాత మరో 90 రోజులు కూగా గడిచిపోయాయి. ఏప్పీ సర్కారు స్పందించలేదు. దీంతోకేంద్రం ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చింది. దీంతో ఏపీ అధికారులు ఢిల్లీకి పరుగులు పెట్టారు. మరి దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.

By Admin

Leave a Reply

Your email address will not be published.