Fri. Feb 3rd, 2023

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలను మాజీ కేప్టెన్, టీ20 ప్రపంచకప మెంటర్ మహేందర్ సింగ్ ధోనీ అంతా తానై నిర్వహించాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ వేడుకలకు ధోనీ దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు. కేండిల్స్ వెలిగించి…కేక్ ను ఏర్పాటు చేసి కోహ్లితో కట్ చేయించాడు. సహచరులతో కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు. కోహ్లీ మొదట ధోనీకే కేక్ తినిపించాడు.

ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. స్కాట్లాండ్ పై అద్భత విజయం సాధించిన అనంతరం ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. సహచరులు సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పోస్టు చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియేల్లో కోహ్లీ ముఖంపై కేక్ పూసినట్లు కనిపించింది.

By Admin

Leave a Reply

Your email address will not be published.