Mon. Dec 5th, 2022

హైదరాబాద్ : ఆధార్ కార్డ్ కు పాన్ కార్డ్ లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. అయితే మార్చి 31 లోగా తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచించగా.. చాలా మంది చివరి తేదీన పోటీ పడటంతో సర్వర్ ఇష్యు వచ్చింది. దాంతో చివరి తేదీని ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 30 లోగా ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఆధార్, పాన్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే పెనాల్టీ వేస్తామని హెచ్చరించింది. ఆధార్ కార్డు ను పాన్ కార్డుతో లింక్ చేసుకునేందుకు https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html ఈ లింక్ ను క్లిక్ చేయండి. వెంటనే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆ వివరాలు ఎంటర్ చేయగానే మీ రెక్వెస్ట్ తీసుకున్నట్లు మెసేజ్ వస్తుంది. వారం రోజల్లోగా ఆధార్ పాన్ లింక్ అయిపోయింది. మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింగ్ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు పైన పేర్కొన్న లింక్ సైట్ లో పై భాగంగా చెక్ యువర్ ఆధార్ పాన్ లింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఆధార్ – పాన్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


By Admin

Leave a Reply

Your email address will not be published.