Mon. Dec 5th, 2022

రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగడమే.. కష్టం. అలాంటిది 13 ఏళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత ప్రధానిగా ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 20 ఏళ్లుగా రాజకీయ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనే ప్రధాని నరేంద్రమోదీ. తన ఇరవై ఏండ్ల రాజకీయ పదవీ జీవితాన్ని మోదీ పూర్తి చేసుకున్నారు. ఇలా సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్​ సృష్టించారు. అయితే పశ్చిమబెంగాల్​ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు 23 ఏళ్లు కొనసాగారు. జ్యోతిబసు జాతీయ రాజకీయాల్లోకి రాని విషయం తెలిసిందే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్​పెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలా 2001 నుంచి ఇప్పటి వరకు ఇటు వ్యక్తిగతంగా.. అటు ప్రభుత్వ పరంగా.. ఓటమి చవిచూడని నేత నరేంద్ర మోదీ.

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. అమలు చేసిన సంస్కరణలతో  గుజరాత్ రూపు రేఖలే మారిపోయాయి. మొదటగా ఆయన విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి.. ప్రతి ఇంటికీ.. విద్యుత్‌ అందించి వెలుగులు నింపారు. గుజరాత్‌లో 2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. భారీగా పెట్టుబడులు రావడంతో గుజరాత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్‌ఫ్రా రంగాలు పురోగతిలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో గ్రామాల్లో బసచేస్తూ బాలికలను చదువుకోవాలని సూచిస్తూ పాఠశాల్లో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టిసారించి విజయం సాధించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.