Mon. Dec 5th, 2022

ప్రత్యర్థులన్నప్పడు ఆరోపణలకు ప్రత్యారోపణలు సహజం.  ఒక్కోసారి అబ్బే అదంతాఏమీ లేదు అంతా తూచ్​ అని తప్పించుకుంటుంటారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ, వ్యవస్థకో పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు టీఆర్​ఎపీ రేటింగ్​ విషయంలోనూ ఇదే జరుగుతోంది. నటుడు సుశాంత్​ రాజ్​పుత్​ మృతి కేసుకు సంబంధించి తాము కథనాలు ప్రసారాలు చేసినందుకు.. ప్రతికారంతో టీఆర్​పీ కుంభకోణం కేసులో ఇరికించారంటూ రిపబ్లిక్ టీవీకి ఓల్​ అండ్ సోల్ అర్నాబ్​ గోస్వామి ఆరోపణలు చేశారు. పైగా ఎఫ్​ఐఆర్​లో తమ ఛానల్​ పేరు లేకున్నా.. కమిషనర్​ చెప్పారంటూ విమర్శించారు. ఈ టీఆర్​పీ రేటింగ్​ విషయంలో రిపబ్లిక్​ టీవీ ఓనర్​ అర్నాబ్​ గోస్వామి చేసిన ఆరోపణలను శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ కొట్టేశారు. అబ్బే అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇందులో ప్రతికారం లేదు మన్నూ మశానం లేదు. సాహసంగా టీఆర్​పీ కుంభకోణాన్ని వెలికి తీశారంటూ పోలీసులపై ప్రశంసలు గుప్పించారు.  పైగా ఇది ఆరంభం మాత్రమే.. త్వరలోనే అంతా బయటపడుతుందని గంభీరంగా సెలవిచ్చారు. 

ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారో అందరూ బయటపడుతారని చెబుతూ వారికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తేలిపోతుందని చెప్పేశారు. ముంబయి పోలీసులు ప్రొఫెషనల్‌గా పనిచేస్తారని, కక్షలు, ప్రతీకార చర్యలకు పాల్పడరంటూ కితాబిచ్చారు. ఆ వెంటనే.. ప్రతికారం మా నుంచి లేదు.. కొన్ని ఛానళ్లే తమపై ప్రతికారంగా వ్యవహరిస్తున్నాయంటూ రిపబ్లిక్​ టీవీ పేరు చెప్పకనే చెప్పేశారు. తమ మహా వికాస్‌ ఆగాఢీ ప్రభుత్వాన్ని, ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొంటూ కొన్ని ఛానళ్లు కథనాలు వండి వారుస్తన్నాయని, ఇది ప్రతీకారం కాదా? అని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన వ్యాఖ్యల్లో మర్మమేమిటంటే.. తమపై ప్రతికారంగా వ్యవహరించమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్​ టీవీని ఎగదోస్తోంది. ఆ ఛానల్​కు కర్త కర్మ క్రియ మొత్తం బీజేపీ అని. మా నాయనే.. చెప్పేదేదో సూటిగా చెప్పొచ్చుగా అనుకుంటున్నారా..? అలా చెబితే సంజయ్​ రౌత్​ రాజకీయ నాయకుడెందుకు అవుతారు.

By Admin

Leave a Reply

Your email address will not be published.