Mon. Dec 5th, 2022

క్రికెట్​ అనగానే.. మనకు ముందుగా కన్పించేదీ ఇండియాలో అయితే అప్పట్లో సునీల్ గవాస్కర్​, కపిల్​దేవ్​, వెంగ్​సర్కార్​ ఇలా కొంత మంది. ఈ మధ్యలో.. అదీ కూడా ఇప్పట్లో అయితే సచిన్​ టెండుల్కర్​, మహేంద్రసింగ్​ దోని, విరాట్​ కోహ్లి.. ఇలా ఇంకొందరు అందరి పేర్ల రాయలేముగా.. క్రికెట్​ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీళ్లందరినీ దేవుళ్ల లెక్క ఆరాధిస్తారు క్రికెట్​ అంటే పిచ్చి ఉన్నోళ్లు. ఆట మీద ప్రేమున్నోళ్లు. ఇప్పుడు సీన్​ మారిపోయింది. అప్పటి దేవుళ్లను పక్కన పెడితే ఇప్పటి దేవుళ్లు.. అందునా ఐపీఎల్​లో ఆడుతున్న క్రికెట్ దోని, విరాట్​ కోహ్లిని మరిపించేశారు పంజాబ్​, రాజస్థాన్​ తరపున ఆడుతున్న మయాంక్​, ఇద్దరు  రాహుల్స్​​. స్మిత్​, శాంసన్​ బాల్ వస్తే సిక్స్​ లేకుంటే ఫోర్.  ఈ బౌలర్​.. ఆ బౌలర్​ అన్న తేడానే లేదు. బౌండరీ లైన్​ వద్ద పంజాబ్​ టీంలోని పూరన్​ స్ప్రింగ్​లా ఎగిరి క్యాచ్​పట్టి ఎడం చేత్తో లోనికి విసరడమే స్పెషల్​.

పంజాబ్​ టీం

పంజాబ్‌ తరపున ఈసారి మయాంక్‌ అగర్వాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కెఫ్టెన్​ రాహుల్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఇద్దరు కలిసి 183 రన్స్​ భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా 224 పరుగుల టార్గెట్​ పెట్టారు రాజస్థాన్​ టీంకు. ఐపీఎల్‌లో వేగం (45 బంతుల్లో)గా సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ నిలబడ్డారు.

ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

రాజస్థాన్​ టీం

తమ ముందున్న 224 టార్గెట్​ను వావ్ అనే విధంగా చేధించింది రాజస్థాన్ టీం. శాంసన్‌, స్మిత్‌ బాదుడుకు 8.5 ఓవర్లలోనే స్కోరు 100కు చేరింది. అనంతరం ఆరు ఓవర్లలో చేసింది 40 పరుగులే.. శాంసన్‌ దూకుడు మీదున్నా రాహుల్‌ తెవాటియా జిడ్డు ఆట రాయల్స్‌ కొంప ముంచేటట్టుగానే అనిపించినా ఆ తర్వాత 12 బంతుల్లో ఏడు సిక్సర్లతో 45 పరుగులు చేయగా ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయ్యాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసిన జట్టుగా  రాజస్థాన్​ రాయల్స్‌టీం రికార్డు సృష్టించింది.

By Admin

Leave a Reply

Your email address will not be published.