Mon. Dec 5th, 2022

‘అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. దడ’ ఈ పాట సినిమాలు చూసే వాళ్లకు గుర్తుండే ఉంటుంది. 9 మే 1996లో వచ్చిన భారతీయుడు సినిమాలోనిది ఈ పాట. శంకర్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంగీతం  ఏ ఆర్​ రహమాన్​ సంగీతం, కమల్​హాసన్​, సుకన్య, మనిషా కోయిరాల, ఊర్మిళ నటించారు. అదిరేటి డ్రెస్సు మేమేస్తే పాటలో ఊర్మిళ, కమల్​ కన్పిస్తారు. అవినీతిని సహించని స్వాంతంత్ర్య సమరయోధుడిగా కమల్​ హాసన్​ నటనతో  అప్పట్లో ఈ సినిమా సూపర్​హిట్​. ఈ పాట ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం టీ షర్టులు, జీన్స్​ ప్యాంట్​ వేసుకోవడాన్ని నిషేధించింది. నిషేధమంటే అందరికీ కాదు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో. ఉద్యోగులు గౌరవంగా కన్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఉత్తర్వుల సారాంశమేమిటంటే.. గ్వాలియర్‌డివిజన్‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్‌, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధిస్తూ డివిజనల్‌కమిషనర్‌ఎంబీ ఓజా సర్క్యూలర్‌జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి  విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. ఎంపీ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. జూలై 20న చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ఇల్లాలోని ఓ అధికారి టీ షర్ట్​ వేసుకొని పద్దతిగా లేకుండా వచ్చారు. దీనిపై ఆయన కోపమొచ్చింది. అప్పటికప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు హెచ్చరించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు  టీ షర్టులు, జీన్​ ప్యాంట్​లు వేసుకోవడాన్ని ఇప్పటికే పలు రాష్ర్టాలు నిషేధించాయి. ఈ మధ్యే సెక్రటేరియట్​ ఎంప్లాయిస్​ సంప్రదాయ దుస్తులే ధరించాలని  బిహార్‌, తమిళనాడు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

By Admin

Leave a Reply

Your email address will not be published.